Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఇరుక్కున్న హిందీ టీవీ నటి... పోలీసు కేసు నమోదు!

  • పాయల్ వ్యాఖ్యలతో దుమారం
  • పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
ఓ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టినందుకు బాలీవుడ్ టీవీ నటి పాయల్ రోహత్గిపై పోలీసు కేసు నమోదైంది. జవహర్ లాల్ నెహ్రూ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వీడియో తీసి ఆమె పోస్ట్ చేసింది. దీంతో జైపూర్ పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 21న పాయల్ ఈ ఫేస్ బుక్ పోస్ట్ ను పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో రాజస్థాన్ లో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చర్మేశ్ శర్మ, రోహత్గిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నెహ్రూతో పాటు ఆయన తండ్రి మోతీలాల్ ను, భార్య, తల్లిని కూడా అవమానించిందని ఈ సందర్శంగా చర్మేశ్ ఆరోపించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణాన్ని ప్రస్తావిస్తూ, అభ్యంతరకరంగా మాట్లాడారని, ఇవి చూస్తే, ఇతర దేశాలు భారతావని గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకునేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ప్రధానులను అవమానించడంతో పాటు దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పలు బుల్లితెర రియాలిటీ షోలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న పాయల్, 2008లో బిగ్ బాస్ షోలోనూ భాగమైంది.
Payal Rohatgi
Congress
Nehru
Police

More Telugu News